సభలో కన్నీరు పెట్టుకున్నగరికపాటి

mp-garikapati-rammohan-rao-joined-to-bjp

పదవుల కోసం కాకుండా పార్టీ గెలుపు కోసం బీజేపీలో చేరుతున్నామన్నారు ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు. టీడీపీలో నష్టపోయిన నేతలకు బీజేపీలో న్యాయం చేస్తామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన  బహిరంగ సభలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గరికపాటి భావోధ్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి పనిచేశామని..కష్టకాలంలో పార్టీ చాలా ఆదుకుందన్నారు. తెలంగాణ టీడీపీలో పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇవ్వలేదన్నారు. టీడీపీకి బలం ఉన్నా పోటీకి నిలబెట్టలేదన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి చాలా సార్లు చంద్రబాబుకు చెప్పిన ఆయన పట్టించుకోలేదన్నారు. అసలు పార్టీని తెలంగాణలో ఉంచాలా? తీసేయాలా? అనే పరిస్థితి వచ్చిందన్నారు.

Latest Updates