బంగారంలా చూసుకున్న.. భార్యను కొట్టి ఉద్యోగం పోగొట్టుకున్న ఐపీఎస్ (వీడియో)

మాకు పెళ్లై 32 ఏళ్లవుతుంది. నాభార్యను పువ్వుల్లో పెట్టి చూసుకున్నా. భోగభాగ్యాలు అనుభవిస్తుంది. డబ్బు కావాలంటే డబ్బిచ్చా. విదేశాలకు వెళ్తానంటే పంపించా. అయినా నాభార్య ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్ధం కావడం లేదంటూ పురుషోత్తం శ‌ర్మ వాపోయారు.

మధ్యప్రదేశ్ కు చెందిన  పురుషోత్తం శ‌ర్మ  అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్  ఆఫ్ పోలీస్‌గా నిన్నటి వరకు సేవలందించారు. అయితే ఆయన త‌న  భార్య‌ను కొడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వివరణ ఇవ్వాలంటూ పురుషోత్తం కు ఆదేశాలు జారీ చేస్తూ విధుల నుంచి తొలగించారు.

అయితే  ఏడీజీగా విధులు నిర్వహించిన పురుషోత్తం తన భార్యను కొడుతుండగా..ఆయన కొడుకు వీడియో తీశారు.

ఆ వీడియోలను ముఖ్యమంత్రి చౌహాన్ కు, హోమంత్రి మిశ్రాకు, డీజీపీ వివేక్ జోహారికి షేర్ చేశాడు. అనంతరం తన తండ్రి శర్మపై డొమెస్టిక్‌ వయెలెన్స్ కేసు నమోదు చేయాలని కోరుతూ లేఖ రాశారు.

ఆ లేఖపై పురుషోత్తం శర్మ స్పందించారు. నాపై డొమెస్టిక్‌ వయెలెన్స్ కేసు  నమోదు కాలేదని, ఇది మా (భార్య ‌‌– భర్త ) ఇద్దరికి సంబంధించింది. నాభార్యను అపరూపంగా చూసుకున్న. కావాలనే నాభార్య, నాకొడుకు నన్ను కార్నర్ చేసేందుకు ఆ వీడియో తీశారని అన్నారు.

ఈ కేసుపై  హోంమంత్రి  మిశ్రా మాట్లాడుతూ నేను ఈ విషయం గురించి మీడియా ద్వారా మాత్రమే తెలుసుకున్నాను. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుందన్నారు.

Latest Updates