మోడీ, కేసీఆర్, జగన్.. చంద్రబాబును కలలో భయపెడుతున్నారు

నల్గొండ : చంద్రబాబు ఓటమి భయంతో నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి… సీఎం కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు  AP ప్రజలను  మోసం చేస్తున్నాడని అన్నారు. అసహనంతో, ఈర్షతో చంద్రబాబు తెలంగాణపై విరుచుకుపడుతున్నాడని ఆరోపించారు. మోడీ, కేసీఆర్, జగన్ వీళ్లు చంద్రబాబుకు కలలో వస్తున్నారనీ..  వీళ్ల పేరు వింటేనే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం జగన్ ను కలిసి చర్చిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు దుష్టపాలన  తొందర్లోనే అంతమవుతుందని చెప్పారు. కేసీఆర్ లాంటి నాయకుడు మాక్కూడా ఉంటే బాగుండు అని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు గుత్తా.

నల్గొండలోని తన ఇంట్లో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. 39 మందికి రూ.14 లక్షల 17 వేల విలువైన రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు.

Latest Updates