నా సీటు 200 కోట్లకు అమ్ముకున్నారు: జితేందర్ రెడ్డి

మహబూబ్‌ నగర్, వెలుగు:‘టీఆర్‌‌ఎస్‌‌ వందల కోట్లకు ఎంపీ టికెట్లు అమ్ముకుంది. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు అంటున్నడు. అందులో నా సీటు పాలమూరుకే ఎక్కువ రేటు పలికిందట. 200 కోట్లకు అమ్ముకున్నారట. నా స్థానానికి  అంత డిమాండ్‌‌ ఉండడం సంతోషంగా ఉంది. చేవెళ్ల సీటు ఖరీదు 150 కోట్లట. ఇంకోసీటు 100 కోట్లట’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు మహబూబ్‌ నగర్ ఎంపీ, బీజేపీ నేత జితేం దర్ రెడ్డి. ‘వీ6 -వెలుగు’తో ఆయన బుధవారం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ద్రోహులకు టీఆర్‌‌ఎస్‌‌ టికెట్లు అమ్ముకుందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే.. టీఆర్‌‌ఎస్‌‌ సర్కారుతో రాష్ట్రా నికి గడ్డుకాలం దాపురించింది.పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా పారిశ్రామికవేత్తలకు, ప్రజా సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేని వాళ్లకు టికెట్లు ఇచ్చారు.’అని అన్నారు.అదో గండికోట రహస్యం‘నన్ను చూసి చంద్రుడే ఓర్వలేక పోయాడు. ఆయనకు మచ్చుంది. అది నాకెందుకు ఉండకూడదని బట్టకాల్చి మీదేశారు. నాకు క్రమశిక్షణ లేదనడం అన్యాయం. నాకు క్రమశిక్షణ లేదని చెప్పినోళ్లకే క్రమ శిక్షణ లేదు. నేను బీజేపీలోంచి వచ్చిన. ఆ పార్టీ నుంచి పార్లమెంట్‌ కు వెళ్లిన. అలాంటి నాకు.. క్రమశిక్షణలేదా? ముందు నా మీదున్న అభియోగం ఏంటోచెప్పి ఆరోపణలు చేయండి. నాపై కేసీఆర్‌‌..సర్జికల్ స్ట్రైక్ చేశారు. అలా ఎందుకు చేశారో తెలీదు.

అదో గండికోట రహస్యం

నేను ఏనాడూ వెనక్కి తగ్గలేదు.ఉద్యమంలో కీలకపాత్ర పోషించా. తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో నా కూ భాగముంది. ఒక్కసారిగా నన్ను తీసి పక్కనెలా పెడతారు. ఉద్యమంలో నా పాత్ర  లేకుంటే నాకు ఫ్లోర్‌‌లీడర్‌‌షిప్‌‌ ఎందుకిచ్చారు. నాకు సీటు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు. జిల్లాప్రజల అభిమానం నాపై ఉంది. నాకు ఇంత కంటే మంచి పదవులే వస్తాయి. నన్ను సీఎం డ్రాప్ చేస్తే..పీఎం గుండె లకు హత్తుకున్నారు. నన్ను ఎంత ఒత్తితే అంత లేస్త. నా ఫ్యూచర్‌‌పై బాధలేదు. నన్ను నచ్చి,మెచ్చి జనమే పైన కూర్చోబెడతరు.’అని అన్నారు.

జనానికి తెలిసిపోయింది.. ఇక నమ్మరు

‘ఎన్నికలకు ముం దున్న కార్యక్రమాల జోరు ఇప్పుడేది. ఇచ్చిన హామీల్ని పక్కకునెట్టి జాతీయ రాజకీయాల్లోకి వె ళ్తానంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం నమ్మరు. ఇంటిం టికి నీళ్లిచ్చాకే ఓట్లడుగుతా అన్నవ్‌ . అలా చేయలేకపోయావ్‌ . మాటతప్పి ఇప్పుడు రెండో సా రి ఓట్లడుగుతున్నవ్‌. జనంఎలా నమ్ముతారు?. రైతు బంధుపై జనం రియలైజ్‌‌ అయినరు. ఎన్నికలకు ముందు నెలకు లక్ష కేసీఆర్‌‌ కిట్లు ఆర్డరిస్తుండే. ఇప్పుడు పదివేల కిట్లకు ఆర్డరిస్తే ఎక్కువ. అన్నీ తగ్గిస్తున్నరు.’అని మండిపడ్డారు.

అవి టెర్రరిస్టు మాటలు

‘సర్జికల్‌ స్ ట్రైక్స్‌‌ గురించి కేసీఆర్‌‌ మాట్లా డిన మాటలు టెర్రరిస్టులు మాట్లాడాల్సినవి. ఈ విషయంపై దేశం మొత్తం గర్వంగా చెప్పుకుంటుంటే.. కేవలం కేసీఆర్‌‌ మాత్రం ఉగ్రవాదుల మాట మాట్లా డుతున్నరు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 16 సీట్లతో ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయితడు

‘మీరు ఎవరితో కలిసి ఫ్రంట్‌ కడతరు. మీతో జాతీయ నా యకులు టచ్‌‌లో ఉండి ఉంటే ఇక్కడకొచ్చి మీ తరఫున ప్రచారం చేసే వాళ్లు కదా. అసలు మీతో టచ్‌‌లో ఉన్న నా యకులెవరో చెప్పండి. అవన్నీ ఉత్త మాటలే. ప్రాంతీయ పార్టీల నా యకులంతా ఎవరి ప్ లా న్లలో వారున్నరు. మీతో కలిసొచ్చే దెవరు? దేశంలో భూముల గురించి , నీటి లెక్కల గురించి మాట్లాడుతున్నడు. మహబూబ్‌ నగర్‌‌ జిల్లా అంతటికి నీళ్లెందుకు ఇయ్యలె.’అని దుయ్యబట్టారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని, కారు.. సారు..16 వర్కవుట్‌ కాదని జితేందర్‌ ‌రెడ్డి అన్నారు.

Latest Updates