సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహిస్తాం : ఎంపీ కవిత

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు ఎంపీ కవిత. ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ పెంచే ప్రయత్నం  చేస్తామన్నారు.  శిల్పారామంలో జరిగిన విమెన్  ఆఫ్  ఇండియా  ఆర్గానిక్  ఫుడ్ ఫెస్టివల్  ముగింపు  కార్యక్రమానికి హాజరయ్యారు  కవిత. ఆర్గానిక్  ఫెస్టివల్ ను నగరవాసులు  బాగా ఆదరించారన్నారు. పాల నుంచి  బెల్లం వరకు  ప్రతి నిత్యావసర వస్తువు  కల్తీ  అవుతుందన్నారు.  చాలామంది  డైట్ అంటూ  అపోహలు కల్పిస్తున్నారని.. ..తనకు  తెలిసిన  డైట్ మాత్రం.. కావాల్సినంత  తిని.. అరిగేంత వరకు  పనిచేయడమే  అన్నారు.

Latest Updates