వరాలు ఇచ్చే దేవుడు కేసీఆర్ : ఎంపీ కవిత

జగిత్యాల జిల్లా :  ప్రచారంలో భాగంగా గ్రామాలు చుడుతున్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు.

సభలో మాట్లాడిన కవిత.. రాష్ట్రంలో ఎవ్వరు ఏది అడిగినా ఇచ్చే కేసీఆర్ బోలా శంకరుడు అని అన్నారు. అడిగిన వారికి వరాలు ఇచ్చే దేవుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన అందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీజేపీ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కవిత. బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ అని విమర్శించారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడని.. సంక్షేమానికి ఓటేయాలని కవిత పిలుపునిచ్చారు.

Latest Updates