చప్పట్లు కొట్టి ఎంపీ కోమటిరెడ్డి సంఘీభావం

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా..కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తోన్న వైద్య, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చప్పట్లు కొట్టారు. జనతా కర్ఫ్యూలో.. పోలీసులు, జర్నలిస్టులు, డాక్టర్లు, ఫైర్ సిబ్బంది.. దేశానికి వీరు చేస్తున్న సేవలకు గానూ కోమటిరెడ్డి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చప్పట్లు కొట్టారు.  ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించి కరోనా నివారణకు తొడ్పడాలన్నారు.

Latest Updates