కొడుకును సీఎంని చేయడానికే సెక్ర‌టేరియేట్‌ కూల్చుతున్నాడు

ఇప్పుడున్న‌ సచివాలయంలో ముఖ్యమంత్రుల కొడుకులెవ‌రూ ముఖ్యమంత్రులు కాలేదనే.. కేసీఆర్ సచివాలయాన్ని కూల్చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ భువ‌న‌గిరి వెంక‌ట‌రెడ్డి. వాస్తు లేదనే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చుతున్నారని, ఇదొక పిచ్చి తుగ్ల‌క్ చ‌ర్య అని మండిప‌డ్డారు. ఈ రోజు త‌న ఇంటి ముందు పోలీస్ లను మోహరించారని, బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారని ఎంపీ అన్నారు.

రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని కేసీఆర్ నష్టం చేస్తున్నారన్నారు. కరోనాతో మనుషులు చనిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడుకోవాలి గానీ.. కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని, ప్ర‌జ‌లంతా కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను చిత్తుచిత్తు గా ఓడిస్తారని చెప్పారు. కొత్త సచివాలయం నిర్మించి కేసీఆర్ అక్కడి నుండి పాలన చేయకపోతే వేల మందితో కొత్త సచివాలయాన్ని కూల్చివేస్తామ‌ని చెప్పారు.

Latest Updates