
నల్గొండ జిల్లా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మంచి మనసు చాటుకున్నారు. గురువారం చిట్యాల మండలం, పెద్దకాపర్తి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. అయితే ఆ సమయంలో నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆగి ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. మృతుని కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ. 10వేలు ఆర్ధిక సాయం చేశారు. వెంటనే మృతదేహానికి పోస్టుమార్టం చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులను ఆదేశించారు ఎంపీ కోమటిరెడ్డి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.