పీసీసీ రేసులో నేనూ ఉన్నా.. పార్టీ కోసం పని చేస్తున్నా

Delhi: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిని నియమించనున్న నేపథ్యంలో..  గురువారం ఉదయం సోనియా గాంధీతో కోమటిరెడ్డి సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కోరిన మేరకే సోనియా అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పార్టీ అధ్యక్షురాలితో చర్చించానని, తెలంగాణలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాగల అవకాశాలపై చర్చించామని చెప్పారు.

పీసీసీ అధ్యక్షుడుగా తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో నమ్మకమున్న వారికే  పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కోరానన్నారు కోమటిరెడ్డి .తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని… పార్టీ కోసం పని చేస్తున్నాని చెప్పారు. ఆరెస్సెస్ నేపధ్యమున్న వ్యక్తికి బీజేపీ మొదటి సారి ఎంపీ అధ్యక్ష బాధ్యతలిచ్చిన నేపధ్యంలో కాంగ్రెస్ కు కూడా సీనియర్లు, విధేయులకు అవకాశం ఇవ్వాలని కోరామని చెప్పారు వెంకటరెడ్డి.

Latest Updates