రైతు ఆత్మహత్యల్లో మూడవ స్థానం..కేసీఆర్ సిగ్గుపడాలి

రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా ఆత్మహత్యల్లో నెంబర్ వన్ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం శివారులో ఎస్ఎస్ఆర్ వ్యూస్ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తి చేసి ఇక్కడి రైతులకు సాగు నీరు అందించాలన్నారు.  హైదరాబాద్ నుంచి వచ్చే డ్రైనేజి నీళ్లతోని  చెరువులు నింపలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే ముఖ్యమంత్రి అంటారన్నారు. రైతు ఆత్మహత్యలలో తెలంగాణ మూడవ స్థానంలో ఉందని..దీనికి తెలంగాణ సీఎం సిగ్గుపడాలన్నారు. రెండున్నర లక్షల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్టాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పుల పాలు చేశారన్నారు.

Latest Updates