ప్రజల నుంచి బీజేపీ రూ. 18 లక్షల కోట్లు వసూల్ చేసింది

పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై.. 20 రోజులుగా వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతున్నదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో గత మూడువారాల నుంచి ప్రతిరోజూ పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ కి లేఖ రాశారు. కరోన మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాయని ఆయన అన్నారు. ‘మన దేశంలో పేద, మధ్య తరగతి, రైతులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఉపాధి లేక వలస కార్మికులు, పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ధరలు తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాల్సింది పోయి.. ధరలు పెంచడం దారుణం. ప్రజలు ఇంత దుర్భర జీవితాన్ని ఎదురుకొంటున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.. విచిత్రంగా మనదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014లో క్రూడాయిల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ 71.40, డీజిల్ రూ. 59.59 ఉంది. 2020లో క్రూడాయిల్ ధర 43.41 కి సుమారు 60 శాతం తగ్గితే.. పెట్రోల్ ధర లీటర్ కి సుమారుగా రూ 20.68 ఉండాలి. కానీ, ప్రస్తుతం రూ. 82.96 ఉంది. మోదీ ప్రభుత్వం ఒక నియంతలాగా దేశాన్ని పాలిస్తుంది. ఇష్టానుసారంగా ఎక్సైజ్ పన్నులను పెంచుతూ పేద వాడి బతుకు మీద దెబ్బకొడుతుంది. ఆరు సంవత్సరాలుగా కేవలం ఎక్సైజ్ పన్నులు పెంచడం ద్వారా సుమారు 18 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని బీజేపీ ప్రభుత్వం వసూల్ చేసింది’ అని కోమటిరెడ్డి అన్నారు.

For More News..

సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ లో వైరల్ అవుతున్న కరోనా డెడ్ బాడీల ఫేక్ న్యూస్

హైదరాబాద్లో.. మళ్లీ లాక్డౌన్! అన్నీ సిద్ధం చేయాలని సీఎం సూచన

Latest Updates