చపాతీల విషయంలో గొడవ.. అత్తను చంపిన అల్లుడు

భోపాల్: చపాతీల విషయంలో జరిగిన గొడవలో అత్తను కిరాతకంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. మధ్యప్రదేశ్​ లోని ఖండ్వా జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగిందని అక్కడి పోలీసులు మీడియాకు వెల్లడించారు. అత్త, మామలతో కలిసి నివాసం ఉంటున్న బిల్లోరా గ్రామానికి చెందిన 35 ఏళ్ల సురేష్ .. రాత్రి సమయంలో ఇంటికి చేరుకోగా అత్త గుజార్ బాయి (55) అతనికి భోజనం వడ్డించిందని, ఆ సమయంలో చపాతీల విషయంలో వాగ్వాదం జరగగా.. అదే కోపంలో గుజార్ బాయిని కర్రతో తలపై కొట్టి పారిపోయాడని పోలీసులు వివరించారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిగా తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారన్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని చెప్పారు.

Latest Updates