అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే భయపడాలి: ఎంపీ నవనీత్ కౌర్

అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే భయపడాలని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.

తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేసి మంచి పని చేసారని మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించారని, అందుకే కాల్చి చంపారని తెలిపింది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం ఓ తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్నట్లు చెప్పారు.
ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మశాంతిస్తుందన్న నవనీత్ కౌంర్..ఇకపై అమ్మాయిలపై అత్యాచారాలు చెయ్యాలంటే భయపడాలని హెచ్చరించింది.

Latest Updates