ప్రమాణ స్వీకారం చేయకముందే పెళ్లి చేసుకున్న ఎంపీ

ఈ సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ప్రముఖ బెంగాలీ నటి నుస్రత్ జహాన్ పెళ్లిపీటలెక్కారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌తో ఆమె వివాహం టర్కీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వారిద్దరి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. వారితో పాటు మరో ఎంపీ, నుస్రత్ స్నేహితురాలు మిమీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన వివాహ వేడుక కారణంగా లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారానికి నుస్రత్ హాజరు కాలేక పోయారు.

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపుతో నుస్రత్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగారు. బెంగాల్‌లోని కీలక లోక్‌సభ స్థానమైన బసీర్ హాట్ నుంచి పోటీ చేసి ప్రత్యర్థిపై 3.5లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌ సభ ఎన్నికల్లో మమత 17 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు.

Latest Updates