పెళ్లి చూపులకు పిలిపించి అరెస్టు చేసిన ఖాకీలు

ముల్లు ను ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కోయాలి.. ఇలాంటి డైలాగ్స్ మన తెలుగు సినిమాల్లో చాలా ఫేమస్. ఇదే డైలాగ్ ను అనుసరించి ఓ దొంగల ముఠాను పక్కా ప్లాన్ తో  దొంగల్లాగే ఎర వేసి పట్టుకున్నారు మధ్యప్రదేశ్ పోలీసులు. చివరికి వారు పన్నిన వలలో ఆ కేటుగాళ్లు చిక్కుకున్నారు.

బార్వానీ ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తి… తన కొడుకుకు, ఓ యువతితో పెళ్లి చేశానని, పెళ్లి అనంతరం ఇంట్లోని బంగారు నగలతో ఆ వధువు పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి కంప్లయింట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు.. నగరంలో ఇలాంటి ఘటనలే మరో రెండు జరిగాయని తెలుసుకున్నారు. వాటికి కూడా ఆ అమ్మాయే కారణమై ఉంటుందనే కోణంలో విచారణ చేయగా..  ఆ నవ వధువు వెనుక పెద్ద గ్యాంగే ఉందని,  ఓ పక్కా ప్రణాళికతో పెళ్లి పేరుతో యువకుల సొమ్మును దోచుకుంటున్నారని తెలిసింది.

వెంటనే రంగంలోకి దిగి.. ఆ గ్యాంగ్ ను పట్టుకునేందుకు తామే ఓ పెళ్లి కుమారుడి కుటుంబంగా మారారు పోలీసులు. వారి వివరాలు తెలుసుకొని తమ కుటుంబ సభ్యుడికి మంచి సంబంధం చూస్తున్నామని, ఆ గ్యాంగ్ కి ఓ మధ్యవర్తి ద్వారా కబురుపెట్టారు. ఇదంతా నిజమేనని అనుకున్న ఆ ముఠా..  మగ పెళ్లివారు ఏర్పాటు చేసిన  పెళ్లి చూపుల తతంగానికి హాజరైంది. వారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామని కాపు కాసి ఎదురు చూస్తున్న పోలీసులు..  ఆ గ్యాంగ్ వారు చెప్పిన స్థలానికి రాగానే మూకుమ్మడిగా అరెస్ట్ చేశారు.

ఒక్కసారిగా వారిని అరెస్ట్ చేసే సరికి తాము వచ్చింది పోలీసులతో సంబంధం కలుపుకుందామని తెలిసి అవాక్కయ్యారు. బోల్తా పడ్డామని తెలుసుకొని ఇక చేసేదేమీ లేక.. కటకటాలు లెక్క పెట్టేందుకు వారితో పాటు స్టేషన్ కి బయల్దేరారు.

ఇలా గతంలో జరిగిన పెళ్లి తంతుల్లో కిరణ్ అనే అమ్మాయిని అందంగా వధువు గా అలంకరించి, పెళ్లి పేరుతో మోసం చేసి నగలతో ఉడాయించేవారని పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసులో కిరణ్ తల్లి సునీత, మరో మహిళ చాకేలిబాయి, మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

MP: Police team pose as groom's family to nab robber bride

Latest Updates