విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ దేశ భక్తుడు కాలేడు

  • రాహుల్‌పై ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కాంట్రవర్షియల్ కామెంట్స్

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోమారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఓ ఫారెనర్ (విదేశీయురాలు)కు పుట్టిన బిడ్డ ఎప్పటికీ దేశ భక్తుడు కాలేడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనీ ఉద్దేశించి అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల దేశభక్తిని ప్రగ్యా ప్రశ్నించారు. ‘ఒక బిడ్డ ఏమట్టిలో పుడితే ఆ దేశాన్ని అతడు రక్షిస్తాడని చాణక్యుడు చెప్పాడు. విదేశీ మహిళకు జన్మించిన బిడ్డ ఎప్పటికీ దేశ భక్తుడు కాలేడు. మీకు రెండు దేశాల్లో పౌరసత్వం ఉంటే దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి. కాంగ్రెస్ నేతలకు ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీలో విలువలు, ధైర్యం, దేశ భక్తి లోపించాయి’ అని ప్రగ్యా సింగ్ ఠాకూర్ మండిపడ్డారు.

 

Latest Updates