‘మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్ళు‘

ప్రధాని మోడీ తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు, రైతులకు ఉరితాళ్ళన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. 45 రోజులుగా  చలిలో దీక్షలు చేస్తున్నారని..13 మంది అన్నదాతలు చనిపోయినా  మోడీకి మానవత్వం లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.  రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ , సీఎల్పీ దీక్షలు చేస్తుందన్నారు.  80 కోట్ల మంది ఆధారపడ్డ వ్యవసాయాన్ని మోడీ విధ్వంసం చేసే కుట్ర జరుగుతుందన్నారు.  ప్రతిపక్షాల సూచనలను పెడచెవిన పెట్టి కొంతమంది కార్పొరేటర్లకు అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. మంద బలం ఉందని అడ్డగోలుగా పని చేస్తున్నారన్నారు. రైతులు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారన్నారు. కనిస మద్దతు ధర రైతులకు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ దక్కుతుందన్నారు.

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా బంద్ లకు మద్దతిచ్చిన  కేసీఆర్ ఢిల్లీకి పోయి మోడీ దగ్గర మొకరిల్లారన్నారు.  గులాం గిరి చేసేందుకు కొనుగోళ్ళు కేంద్రాలను రద్దు చేశారన్నారు. రైతుల పంటను కొనుగోళ్ళు చేస్తే రూ.7500 కోట్లు నష్టం వచ్చిదన్న కేసీఆర్ ..అది ఎవరి డబ్బని ప్రశ్నించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసి అత్యవసర అసెంబ్లీ పెట్టాలని కోరారు. ఢిల్లీలోని రైతులకు మద్దతుగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతామని.. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.

Latest Updates