విభజించి  పాలించు తరహాలో మోడీ రూలింగ్: రేవంత్ రెడ్డి

విభజించి  పాలించు తరహాలో  దేశంలో  వ్యవస్థలను  ప్రధాని మోడీ  నాశనం  చేశారన్నారు  కాంగ్రెస్  ఎంపీ రేవంత్ రెడ్డి.  ఆర్థిక  మాంద్యం దేశాభివృద్ధిని  తిరోగమనంలో  తీసుకెళ్తుందన్నారు.  ఢిల్లీలోని  రాంలీలా  మైదానంలో.. కాంగ్రెస్ పార్టీ  చేపట్టిన  భారత్ బచావో  నిరసన కార్యక్రమంలో  పాల్గొన్నారు.  తెలంగాణ నుంచి   వచ్చిన  4 వేల మంది  నేతలు, కార్యకర్తలు  నిరసలో పాల్గొన్నారు.  దేశంలో  శాంతి భద్రతలు  కరువయ్యాయని.. మహిళలకు  రక్షణ లేకుండా  పోయిందన్నారు.  ఏడాది  పాలనలో  కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు  రేవంత్.  రాష్ట్రాన్ని కేసీఆర్  బాకీల తెలంగాణ గా  మార్చారన్నారు. కేసీఆర్  దోపిడీ ఆపేస్తే  రాష్ట్రం అభివృద్ధి  చెందుతుంది  అన్నారు రేవంత్.

Latest Updates