కేసీఆర్‌కు నీళ్ల క‌న్నా లిక్క‌ర్ బ్రాండ్‌ల గురించి బాగా తెలుసు

కృష్ణా జలాల దోపిడీలో మరో దారుణం జ‌రిగింద‌ని అన్నారు ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. పోతిరెడ్డి పాడు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన‌ జీవో 203 తో నీళ్ళు తరలిపోవడమే కాకుండా.. విద్యుత్ నష్టం కూడా దారుణంగా జ‌రిగిందని చెప్పారు. అపర మేధావి కేసిఆర్ కు, బాల మేధావి కేటీఆర్ కు ఈ విషయం తెలియదా..? అని ప్ర‌శ్నించారు.

ప్ర‌త్యేక తెలంగాణ వచ్చాక కాంట్రాక్టులు ఆంధ్రోళ్లకు, నిధులు కేసిఆర్ కు, నియామకాలు కేసిఆర్ కుటుంబానికి జరిగాయ‌ని చెప్పారు.కేసీఆర్ బాగా తెలిసింది నీళ్ళ గురించి కాదని, లిక్కర్ బ్రాండ్ ల గురించి బాగా తెలుస‌న‌ని అన్నారు. అందులో ఏ సోడా వాడాలో తెలుసు కానీ..నీళ్ళ గురించి కాదుని అన్నారు. వాళ్ళ పార్టీ నేతలే ఈ విష‌యాన్ని చెబుతున్నార‌న్నారు. ఆయ‌న చ‌దివింది 80 వేల పుస్తకాలు కాదని, తాగింది 80 వేల లిక్కర్ సీసాలని అన్నారు.

శ్రీశైలం లో నీళ్ళు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి జరగదన్నారు రేవంత్. శ్రీశైలం నుంచి దిగువకు నీళ్ళు వస్తే తప్ప నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి జరగద‌ని, తెలంగాణ రాష్ట్ర వాటా ఉత్పత్తి కి కావల్సిన 1404 మెగావాట్ల విద్యుత్ ను కోల్పోతామ‌ని చెప్పారు. భవిష్యత్ లో ఈ విద్యుత్ ప్లాంట్లు డీఫంక్టు అవుతాయని చెప్పారు. ఒక మెగావాట్ హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలంటే 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ లెక్కన 1404 మెగావాట్ల ప్లాంట్ లు కొత్తగా కట్టుకోవాలంటే 12 వేల నుంచి 15 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు రేవంత్ .ఈ ప్లాంట్ లు మూలంగా బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రస్తుత బహిరంగ మార్కెట్ లో 4 రూ.లు నుంచి 18 రూ. యూనిట్ ధర పలికిన సందర్భాలు ఉన్నాయన్నారు.

అపర మేధావి కేసీఆర్ దీనిపై స‌మాధానం చెప్పాలని రేవంత్ అన్నారు. విద్యుత్ కు జరిగే నష్టం బుర్రకు ఎక్కిందా? లేదా? ఎక్కినా ఎక్కనట్టు నటిస్తున్నావా? అని ప్ర‌శ్నించారు. విద్యుత్ ప్లాంట్ల కు జరిగే నష్టాల పై తెలంగాణ సమాజానికి స‌మాధానం చెప్పాల‌న్నారు రేవంత్.

Latest Updates