అర్నాబ్ గోస్వామి పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. త‌మ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ పై ఆర్నాబ్ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా ఉన్నాయని రేవంత్ తెలిపారు. తక్షణం ఆర్నాబ్ అరెస్టుకు ఆదేశాలు జారీ చేయాల‌ని స్పీక‌ర్ ని కోరారు రేవంత్.
ఒక ఎంపీ, పార్లమెంటరీ పార్టీ లీడర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రివిలైజ్ కమిటీకి కూడా రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ కారణంగా ప్రివిలైజ్ మోషన్ ఆన్ లైన్ లో పంపుతున్నాని తెలిపారు. పార్లమెంటు గౌరవాన్ని, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గా ఓం బిర్లా పై ఉంటుందన్నారు.

Latest Updates