దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక

దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నికగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మిరుదొడ్డి మండలం కూడవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి రేవంత్ ప్రచారం నిర్వహించారు. రెవిన్యూ డివిజన్ కావాల్సిన దుబ్బాకను హరీష్ రావు కుట్రతో అడ్డుకున్నారని ఆరోపించారు. ఏడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ఏ ఒక్కహామీని నెరవెర్చలేదన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు రేవంత్. ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి తీసుకువస్తే అడ్డుకున్నది కేసీఆరే అన్నారు రేవంత్.

 

Latest Updates