సమాధానం చెప్పలేక ఉత్తమ్ పై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు

మంత్రి జగదీష్ రెడ్డి కి సారాలో సోడా కలపడం తప్ప ఏమీ తెలియ‌ద‌ని, ఆయనకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందో అందరికీ తెలుస‌ని రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డి తన స్థాయిని మరచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బజారు రౌడీ లాగా , పిక్ పాకేటర్ లాగా వ్యవహరించారన్నారు. చెప్పడానికి ఏమీ లేక ఉత్తమ్ పై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. జగదీష్ రెడ్డికి కుస్తీలు పట్టాలని ఉంటే గ్రౌండ్ చెప్తే కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారన్నారు. త‌మ నాయ‌కుల‌పై అడ్డగోలుగా మాట్లాడితే పడేవారు ఎవ్వరూ లేరని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జగదీష్ రెడ్డిని హెచ్చ‌రించారు.

Latest Updates