TRS వాళ్లు ఆఫో, ఫుల్లో ఇచ్చి ఓట్లు వేయించుకుందాం అనుకుంటుండ్రు

mp revanth reddy ghmc elections campaign speech at quthbullapur

జిహెచ్ఎంసి ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. చింతల్, కుత్బుల్లాపూర్ డివిజన్లలో ప్రచారంలో భాగంగా హాట్ కామెంట్స్ చేశారు. మేము పేదోళ్లనే నమ్ముకున్నం అని అన్నారు రేవంత్. TRS వాళ్లు ఆఫో, ఫుల్లో ఇచ్చి, వెయ్యో.. రెండు వేలో చేతిలో పెట్టి ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నరని అన్నారు. గల్లీ గల్లికి టిఆర్ఎస్, బిజెపి వాళ్లు మిడతల దండులాగ దాడి చేస్తున్నరు.
కరోనా వచ్చినప్పుడు వీళ్లంతా ఎక్కడ పోయిడ్రు.. వరదలో జనం అవస్థలు పడుతుంటే వీళ్లంతా ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్.
జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కనాకొడుకు రాలేదు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారని నిలదీయండి అని అన్నారు రేవంత్. వాళ్ళు వస్తే సలాక కాల్చి వాతలు పెట్టుండ్రి అని అన్నారు. రేపు మీ కష్టాలు తెలుసుకుని కార్పొరేషన్ మీటింగ్ లో అధికారులు, మంత్రులను వంగబెట్టి పనులు చేయించే బాధ్యత నాది అని అన్నారు రేవంత్.

Latest Updates