మల్కాజ్ గిరిలో పట్నంగోస..

పాలమూరంటే సీఎం కేసీఆర్ కు పరాశకాలైందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. మల్కాజిగిరిలోని  భూదేవి నగర్ లో పట్నంగోస కార్యక్రమాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి.  స్థానికంగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న కుటుంబాలతో సమావేశమయ్యారు. మహిళలతో మాట్లాడిన రేవంత్  వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు బతుకులంటే కేసీఆర్ కు పరాశకాలైపోయిందన్నారు. పాలమూరోళ్లు ఏం చెప్పినా నమ్ముతారని అనుకుంటున్నారన్నారు.  ఓట్ల కోసం వచ్చినప్పుడు నాలుగు నెలల్లో డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తానని..పంజాగుట్టలో వేల కోట్లతో 150 గదులతో ఇళ్లు కట్టుకున్నారన్నారు. బాత్రూమ్ ల కోసం వారంలో ఎంపీ నిధులతో కట్టిస్తానన్నారు. బాత్రూమ్ ల నిర్మాణాన్ని ఎవడైనా అడ్డుకుంటే ఆడబిడ్డలు రోకలి బండలతో సమాధానం చెప్పాలన్నారు.

 

Latest Updates