టీఆర్ఎస్ నన్ను గల్లీలో ఓడిస్తే.. ప్రజలు ఢిల్లీకి పంపారు: ఎంపీ రేవంత్ రెడ్డి

కోస్గి, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్​ ప్రభుత్వముంది.. కొడంగల్​లో టీఆర్ఎస్​ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అంతా అభివృద్ధే అన్నారప్పుడు.. 13 నెలలైంది.. నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ అని మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కోస్గి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మహబూనగర్​- చించోలి డబుల్​ రోడ్డు వేయించింది తానేనని, ఆ రోడ్డు ఇప్పుడు గుంతలమయంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కేటీఆర్​ సంవత్సరంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. కుట్రపూరిత రాజకీయాలతో టీఆర్ఎస్ ​తనను ఎమ్మెల్యేగా ఓడిస్తే.. మల్కాజ్​గిరి ప్రజలు ఆదరించి ఢిల్లీకి పంపారని అన్నారు. మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను ఆదరించాలని కోరారు

Latest Updates