కేటీఆర్‌పై విచారణకు ఆదేశించండి

మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ నాయకులు, ఎంపీ రేవంత్ రెడ్డి. 111జీవో పరిధిలో బినామీ పేరుతో కేటీఆర్ రాజమహల్ కట్టుకున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో 111ను సమీక్షిస్తామంటున్నారని చెప్పారు. 111జీవో పరిది నుంచి కొన్ని గ్రామాలకు మినహాయింపు ఆలోచన కుట్ర ఉందని తెలిపారు. పుప్పాల గూడాలో రూ.30 కోట్ల విలువ చేసే ఆస్తి కేటీఆర్ రూ.కోటికే ఎలా కొన్నారని… 2014లో రూ.8 కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తి… 2018కి రూ.41 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

టీఆర్ఎస్ విరాళాలు రూ.188 కోట్లకు పెరగడం వెనుక రాజకోట రహస్యం ఏమిటని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే… మీరు మాత్రం వేల కోట్లకు అధిపతులయ్యారని ఆరోపించారు. త్యాగాల తెలంగాణలో భోగాలు అనుభవిస్తున్నారని.. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు… ఉద్యమాల తెలంగాణను మీరు చెరబట్టారని తెలిపారు.  గచ్చిబౌలి, కోకాపేటల్లో వందల ఎకరాలు ఎలా సొంతమయ్యాయని… కేటీఆర్ పై కేసీఆర్ విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మీ అవినీతి బాగోతాల పై త్వరలో సమగ్ర వివరాలు, ఆధారాలతో పుస్తకం వేస్తామని చెప్పారు.

ఇవికూడా చదవండి..

మజ్లిస్​కు 6 మున్సిపాలిటీలు!…TRS​తో MIM అండర్​స్టాండింగ్

లెఫ్ట్ పార్టీల అబద్ధాల ప్రచారం

హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నరు

టెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు

Latest Updates