ఫ్లెక్సీలు కడితే అధికార పార్టీకి ఫైన్‌లు వేయరా?

అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రూల్స్‌కి విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బేగంపేట్‌లోని ధనియాల గుట్ట దగ్గర నిర్మించనున్న హిందూ స్మశాన వాటిక పనులను మంత్రులు తలసాని, మల్లారెడ్డిలతో కలిసి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే రూల్స్‌కు విరుద్ధంగా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ‘వేరే పార్టీ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫైన్‌లు వేస్తారు కదా.. మరి అధికార పార్టీ చేస్తే ఫైన్‌లు వేయరా?’ అని ప్రశ్నించారు. ప్లెక్సీలను పరిశీలించి వెంటనే ఫైన్ వేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌ను ఆయన కోరారు. ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన బేగంపేట కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

For More News..

ప్రమాణస్వీకారం తర్వాత బిడెన్ చదివేది మన వినయ్ రెడ్డి రాసిన స్పీచే

ఇంటి ముందున్న చెట్టు నరికిన యజమానికి భారీ ఫైన్..

వాహనాల మీద పడ్డ బండరాళ్ల ట్రక్కు.. 13 మంది మృతి

Latest Updates