కోవిడ్ ఆస్పత్రికి రూ.50 లక్షలు ఇచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి

కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలను ప్రభుత్వానికి అందించారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆస్పత్రి కోసం ఆ డబ్బును మల్కాజ్ గిరి కలెక్టర్ కు అందజేశారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కరోనా బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించింది.అయితే ఆ ఆస్పత్రికి సివరేజ్ ప్లాంట్ ను విస్మరించారు. దీంతో మురుగు నీరంతా పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాలోకి వెళ్తోంది. ఆ విషయాన్ని అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఈ సమస్యను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. వారం రోజుల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

ప్రభుత్వం కరోనా బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తే… తన ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు కేటాయిస్తానని  ఎంపీ రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.

Latest Updates