రూ.10 కోట్ల గడియారాలు పంచారు: చెవిరెడ్డిపై ఎంపీ శివప్రసాద్ ఫిర్యాదు

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఫిర్యాదు చేశారు. జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులకు లేఖలు రాశారు. చెవిరెడ్డి తన నియోజకవర్గంలో లక్ష గోడ గడియారాలు పంచుతున్నారని, వాటి విలువ పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని అందులో చెప్పారు. వాటన్నింటి పైనా చెవిరెడ్డి ఫొటో ముంద్రించి ఉందన్నారు. వాటి కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న క్లారిటీ లేదని, జీఎస్టీ కూడా కట్టకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించారని శివప్రసాద్ అన్నారు.

Latest Updates