ఆదివాసీల సమస్య పరిష్కరించకుంటే సీఎం ఫాంహౌస్​పై దాడి చేద్దాం

జైనూర్లో ఎంపీ సోయం బాపూరావు

జైనూర్, వెలుగు: ఆదివాసీల సమస్య పరిష్కరించాలని హోలి తర్వాత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుస్తానని, పరిష్కారం కాకపోతే  సీఎం ఫాంహౌస్ పై దాడి చేయడానికి ఆదివాసీలు సిద్ధంగా ఉండాలని తుడుందెబ్బ స్టేట్ ప్రెసిడెంట్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు. సాగు చేస్తున్న పోడు భూముల జోలికి ఫారెస్ట్ ఆఫీసర్లు  వస్తే తరిమికొట్టాలన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు  తన పోరాటం ఆగదని తెలిపారు. కుమ్రం భీం జిల్లా జైనూర్ లో వరల్డ్ ఉమెన్స్ డే పురస్కరించుకొని రాణి దుర్గావతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదివాసీల పోడు భూములపై అధికారుల దౌర్జన్యం ఆపాలని డిమాండ్ చేశారు.

Latest Updates