ఎంపీలకు ప్రోటోకాల్ ఏది?.. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా

ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై పార్లమెంట్ లో ప్రస్థావించి స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య సూర్యాపేట జిల్లా మట్టపల్లి దగ్గర కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిను ఆయన పరిశీలించారు.  కాంగ్రెస్ హయాంలో బ్రిడ్జిని మంజూరు చేశామని.. తన కృషితోనే పనులు త్వరగా పూర్తయ్యాయన్నారు. కేవలం అప్రోచ్ రోడ్డును మాత్రమే టీఆర్ఎస్ మంజూరు చేసిందని.. అయినా బ్రిడ్జి ఓపెనింగ్ కు తనకు గౌరవప్రదమైన ఆహ్వానం అందలేదన్నారు. తర్వాత…మఠంపల్లి మండలం పెద్దవీడు రెవెన్యూ పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ, పేదల భూములను ఉత్తమ్ పరీశీలించారు.

గవర్నర్ ను తొలగించాలని ఆందోళనకు దిగిన సీఎం

Latest Updates