సంప్రదాయం పేరుతో.. భార్యపై తాంత్రికుడితో అత్యాచారం

మధ్యప్రదేశ్:  ట్రిపుల్ తలాఖ్ ద్వారా విడాకులిచ్చిన తన భర్త.. ఓ తాంత్రికుడితో తనపై అత్యాచారం జరిపించాడని భోపాల్ కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఐష్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేయడంతో పోలీసులు ఆమె భర్తని,  తాంత్రికుణ్ని ఇద్దర్నీ అరెస్టు చేశారు.

భోపాల్‌లోని అశోక గార్డెన్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది.  అయితే కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి పెళ్లైన 9 నెలలకే ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. అయితే ఆమెతో ఇకపై ఎలాంటి సంబంధాలు, లావాదేవీలు ఉండకూడదనుకుంటే సంప్రదాయం ప్రకారం హలాలా చేయాల్సిన అవసరం ఉందని ఓ తాంత్రికుడు చెప్పడంతో  అందుకు అతను సరేనన్నాడు.

తలాక్ లో భాగంగా హలాలా చేయాలని తన భార్యకి చెప్పి,  ఆ తాంత్రికుడితో మాట్లాడించాడు. తాంత్రికుడు ఆమెను ఫ్లాట్‌కు తీసుకెళ్లి,  హలాలా పేరుతో ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు.

జరిగిన విషయాన్ని ఆమె మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత ఐష్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.తన భర్త అంగీకారంతోనే ఆ తాంత్రికుడు తనపై అత్యాచారం జరిపాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 343, 376 కింద  వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

MP woman given triple talaq, raped by tantric in name of halala

Latest Updates