గుప్త నిధుల కోసం గుడిలో ఎంపీటీసీ తవ్వకాలు

గుడిలో గుప్త నిధుల తవ్వకాలు

నిందితుల్లో ఒకరు ఎంపీటీసీ 

పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

కాగజ్ నగర్, వెలుగు: గుడిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 8 మంది సభ్యుల ముఠా  సోమవారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ ​జిల్లా పెంచికల్ పేట్ మండలం పోతేపల్లి అభయాంజనేయ స్వామి టెంపుల్‌లో తవ్వకాలు స్టార్ట్ చేశారు. 10 గంటల సమయంలో విషయం గమనించిన గ్రామస్తులు 100 నంబర్​కు కాల్​చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంతకీ పోలీసులు రాకపోవడంతో గ్రామస్తులే ముఠాను పట్టుకుని తాళ్లతో బంధించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎస్సై సిబ్బందితో  గ్రామానికి వెళ్లగా వాళ్లకు ముఠాను అప్పగించారు. ముఠాలో కాగజ్ నగర్ మండలం ఈస్‌గాం సమీపంలోని రామ్ నగర్ ఎంపీటీసీ బికాస్ ఘరామి ఉన్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఎంపీటీసీతోపాటు ఈస్‌గాం ఏరియాకు చెందిన ఐదుగురు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారన్నారు. వారి నుంచి రూ. 22 వేల నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

For More News..

ఓయూలో రేపు జాబ్​ మేళా

హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

టీఆర్ఎస్ ​కబ్జా చేసిన భూములతో లక్షల ఇండ్లివ్వొచ్చు

Latest Updates