3 గంటలకు పరిషత్ ఎన్నికల షెడ్యూల్

స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. ఓటర్ల జాబితా, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది, భద్రత, నోడల్ ఆఫీసర్ల నియామకం, పోలింగ్ మెటీరియల్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో చర్చించారు నాగిరెడ్డి.

రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లు, 535 జెడ్పీటీసీలు, 5 వేల 857 ఎంపీటీసీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 6న తొలి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తొలి విడతలో 212 ZPTCలు, 2 వేల 365 MPTCలు, రెండో విడతలో 199ZPTCలు, 2వేల 19 MPTCలు, మూడో విడతలో 124 ZPTCలు, 13 వందల 43MPTCలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో కోటి 56 లక్షల 11 వేల 320 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 32 వేల పోలింగ్ స్టేషన్లకు లక్షా 85 వేల 502 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఎంపీటీసీలకు లక్షా 50 వేలు, జెడ్పీటీసీలకు 4 లక్షలు ఎన్నికల ఖర్చుగా నిర్ణయించింది ఎన్నికల సంఘం. జెడ్పీటీసీల జనరల్ అభ్యర్థుల నామినేషన్ ఫీజు 5 వేలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రెండు 500 గా డిసైడ్ చేసింది. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 2 వేల 500గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వెయ్యి 250గా నిర్ణయించింది ఎన్నికల సంఘం.  పరిషత్ ఎన్నికలకు  పరిశీలకులను కూడా నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

Latest Updates