పరిషత్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

పరిషత్ ఓట్ల  లెక్కింపునకు  సర్వం సిద్ధమైంది.  రేపు ఉదయం  8 గంటల నుంచి 5 గంటల  వరకు కౌంటింగ్  జరుగుతుంది. అయితే  మధ్యాహ్నానికి  ట్రెండ్స్ తెలిసిపోతాయి.  2వేల  426 మంది  జెడ్పీటీసీ అభ్యర్థులు,  18వేల 930 మంది ఎంపీటీసీ  అభ్యర్థుల  భవితవ్యం  తేలిపోనుంది.  పరిషత్  ఓట్ల లెక్కింపుకు  123 కౌంటింగ్  కేంద్రాలు  ఏర్పాటు  చేశారు. మొదటగా  ఎంపీటీసీ,  తర్వాత జెడ్పీటీసీల  ఓట్లు లెక్కిస్తారు.  లెక్కింపు కేంద్రాల  దగ్గర  భారీ ఏర్పాట్లు  చేశారు పోలీసులు. 144  సెక్షన్ అమలు  ఇంప్లీమెంట్  చేస్తున్నారు. 35వేల మంది సిబ్బంది. .లెక్కింపు విధుల్లో  పాల్గొంటారు.

Latest Updates