పరిషత్ పరేషాన్ : రెండో విడతలో కార్యకర్తల గొడవలు

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు..ఉద్రిక్తతకు దారితీశాయి. మంచిర్యాల జిల్లా ఇందారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఆరోపణలతో..పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఖమ్మం జిల్లాలోనూ సేమ్ సిచ్యువేషన్. కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు చేశారన కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. అక్కడక్కడ పోల్ చిట్టీల్లేక..ఓటర్లు వెనుదిరిగారు. సమస్యల పరిష్కారాం కోరుతూ..కొన్ని గ్రామాల్లో పోలింగ్ ను బహిష్కరించారు స్థానికులు.

సంగారెడ్డి జిల్లా

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో  కాంగ్రెస్ కార్యకర్తలపై TRS కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. ముగ్గరుకి తీవ్రగాయాలయ్యాయి. మనూర్ SI నరెందర్ TRS పార్టీకి కొమ్ము కాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఖమ్మం జిల్లా

రఘునాధపాలెం మండలం వేప కుంట్ల గ్రామంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. దెబ్బలు తగిలిన కాంగ్రెస్ కార్యకర్తలను, వారి కుటుంబాలను పరామర్శించారు రేణుకా చౌదరి. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని, కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు రేణుకా చైదరి. తీవ్ర గాయాలకు గురైన కార్యకర్తలను హస్పిటల్ కు తరలించి చికిత్స చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రేణుకా చౌదరి.

పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి మండలం మూలసాల లో ఓటర్లకు డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ పార్టీ యం.పి.టి.సి.అభ్యర్థి రాంరెడ్డితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి దగ్గరి నుండి 36,500రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు పెద్దపల్లి పోలీసులు. ఓదెలలోని మల్లికార్జున నగర్ లో ఓటు వేయమని టెంట్ వేసుకొని నిరసన తెలిపారు కాలనీ వాసులు.  ఓదెల నుండి కనగర్తి మార్గంలో రోడ్డు వేయాలంటూ ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు కాలనీ వాసులు.

మంచిర్యాల జిల్లా 

జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు డబ్బులు పంచుతుండగా..కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య వాగ్వాదం జరిగింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై విజేందర్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పలువురిపై చేయి చేసుకున్నారు. వివాదం ఇరువర్గాల వివాదం ఘర్షణకు దారి తీసింది. రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కాంగ్రెస్ నాయకులను తెల్ల వారుజామున అరెస్ట్ చేసి, ఉదయం 8 గంటలకు విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. డబ్బులు పంచుతున్న అధికార పార్టీ కార్యకర్తలను వదిలేసి తమను పోలీసులు పట్టుకోవడమేంటని నిరసన వ్యక్తం చేశారు.

వరంగల్ రూరల్:

శాయంపేట్ మండల కేంద్రంలోని 2వ బూత్ దగ్గర TRS అభ్యర్థి గండ్ర జ్యోతి, BJP ఎంపీటీసీ అభ్యర్థి మధ్య గొడవ జరిగింది.

Latest Updates