చైనాను మోడీ పల్లెత్తు మాట కూడా అనలే

సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాను ప్రధాని మోడీ ఒక్క మాట కూడా అనడం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. నార్త్ సిక్కింలోని నాతులా పాస్ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలో మోడీపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోడీని ఛప్పన్ ఛాతీ (56 అంగుళాలు)గా వ్యవహరించిన రాహుల్.. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తోందన్నారు. ఇన్ని నెలల్లో చైనాను మోడీ పల్లెత్తు మాట కూడా అనలేదని విమర్శించారు.

కాగా, నార్త్ సిక్కింలోని నాతులా పాస్‌లో భారత్-చైనా సైనికులు పరస్పరం కొట్టుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో పీఎల్‌‌ఏ దళాలకు చెందిన 20 మంది సైనికులు గాయపడ్డారని, భారత ఆర్మీకి చెందిన నలుగురు జవాన్లకు గాయాలయ్యాయని సమాచారం. మన సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన డ్రాగన్ ప్రయత్నాలను మన జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారని అధికారులు చెబుతున్నారు.

Latest Updates