మందకృష్ణ మాదిగ హౌస్ అరెస్ట్

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఇవాళ(ఆదివారం) MRPS ఆధ్వర్యంలో హైదరాబాద్  ఇందిరా పార్క్ దగ్గర సబ్బండ వర్గాలు దీక్ష జరపాలని నిర్ణయించారు. అయితే దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు…ముందస్తుగా MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీక్షలో పాల్గొనేందుకు ఇందిరాపార్క్ దగ్గరకు వస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోవైపు ఇందిరాపార్క్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పార్క్ చుట్టూ  సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఎమ్మార్పీఎస్ దీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేశారని తమకు సమాచారం ఉందంటున్నారు పోలీసులు.

 

Latest Updates