అంబేద్కర్ సభకు అనుమతివ్వండి: DGPతో మందకృష్ణ

హైదరాబాద్ : ఈ నెల 27న హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర అంబేద్కర్ వాదుల మహాసభకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరారు MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డిని ఆయన కలిశారు. ఇప్పటికే రెండు సార్లు కోరినా.. పర్మిషన్ ఇవ్వలేదని .. అనుమతి ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటామని ఆయన విజ్ఞప్తి చేశారు.

డీజీపీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మందకృష్ణ… రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టుగా ఉందని  విమర్శించారు. సభకు పర్మిషన్ పై 24 గంటల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంద కృష్ణ మాదిగ.

Latest Updates