మిస్టర్​ కూల్​ బర్త్​డే సెలబ్రేషన్స్​

రాంచీ: మోడ్రన్​ ఇండియా మోస్ట్​ లవబుల్​ క్రికెటర్​, టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ మంగళవారం 39వ పడిలోకి అడుగుపెట్టాడు. భార్య సాక్షి సింగ్​, కూతురు జీవాతో కలిసి రాంచీలోని తన ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ధోనీ హంగామా లేకుండా బర్త్​డే సెలబ్రేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. ఇండియన్​ క్రికెట్​ హిస్టరీని తిరగరాసిన మహీకి సహచర క్రికెటర్లతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్​బర్త్​ డే విషెస్​ చెప్పారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కూల్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్న మహీ.. ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఎన్ని ఘనతలు సాధించినా ఓ కర్మయోగిలా తన పని చేసుకుంటూపోతాడు.  అందుకే వరల్డ్​ క్రికెట్​లో ఓ ఐకాన్​గా నిలబడ్డాడు.

బహుమతులకు లొంగవు: సాక్షి

బర్త్​డే సందర్భంగా ధోనీకి అతని భార్య సాక్షి స్పెషల్‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పింది. ‘నీ పుట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ఏడాది గడిచిపోయింది. కొంచెం వయసు పెరిగింది. ఇంకాస్త తెలివిగా, మరింత స్వీట్ పర్సన్​గా మారాల్సిన టైమ్​ వచ్చింది. బహుమతులకు లొంగని వ్యక్తివి నువ్వు.  కేక్​ కట్​ చేసి, క్యాండిల్స్​ వెలిగించి మరో ఏడాదిని సెలబ్రేట్​ చేసుకుందాం. హ్యాపీ బర్త్​ డే’ అని సాక్షి ట్వీట్​ చేసింది. ఇండియన్​ క్రికెటర్లతో పాటు వరల్డ్​ ప్లేయర్లు కూడా ధోనీకి విషెస్​ అందజేశారు. చెన్నై సూపర్​కింగ్స్​ ప్లేయర్​ డ్వేన్​ బ్రావో.. ‘ఎంఎస్​ ధోనీ నంబర్​ 7’ పేరిట ఓ పాటను విడుదల చేశాడు.  ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ తానే స్వయంగా పాడాడు. పాండ్యా సోదరులు చార్టెడ్​ ఫ్లైట్​లో రాంచీ వెళ్లి మరి మహీకి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

సీఎస్కే బాస్ ధోనీయే

మరో పదేళ్లలో ధోనీ.. చెన్నై సూపర్​కింగ్స్​కు పర్మినెంట్​ బాస్​గా మారిపోతాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్​ అన్నాడు. ‘సీఎస్​కే కోసం మహీ చాలా కష్టపడ్డాడు.  జట్టంటే అతనికి చాలా ఇష్టం. ఫ్యూచర్​లో కచ్చితంగా సీఎస్‌‌‌‌కే బాస్​ అవుతాడని నా గట్టి నమ్మకం. ఇక ఈ సీజన్​ ఐపీఎల్​ కోసం ధోనీ చాలా శ్రమించాడు. మార్చిలో జరిగిన ప్రాక్టీస్ క్యాంప్​లో ఎప్పుడూ లేనంత గట్టిగా పోరాడాడు. అతను గ్రేట్​ ప్లేయర్​. ఎప్పటికీ తన స్వభావాన్ని మార్చుకోడు. అందుకే మహీని అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాడు. టీమ్​లోని ప్రతి ఒక్కరి నుంచి పూర్తి సామర్థ్యాన్ని రాబడతాడు’ అని విశ్వనాథన్​ వ్యాఖ్యానించాడు.

నంబర్ ప్లేట్స్ ఇస్తలేరు.. 4 నెలలుగా ఇదే పరిస్థితి

 

Latest Updates