బ్యాటింగ్‌‌ ఫామ్‌‌పై ధోని నమ్మకంగా లేడు

న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్‌‌లో తొలి మ్యాచ్‌‌లో గెలుపుతో శుభారంభం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు ఓటములు మూటగట్టుకుంది. కీలక బ్యాట్స్‌‌‌మన్ అంబటి రాయుడు గాయంతో దూరమవ్వడం సీఎస్కేను దెబ్బతీసింది. కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌‌లో ఆలస్యంగా రావడం టీమ్‌‌‌పై ప్రభావం చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అయితే సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేనందునే బ్యాటింగ్‌‌లో కేదార్ జాదవ్, జడేజా, సామ్ కరన్‌‌ను ముందు పంపినట్లు కోచ్ ఫ్లెమింగ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో చెన్నై పరాజయాలపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన బ్యాటింగ్ ఫామ్ పై ధోని పూర్తి నమ్మకంతో లేనట్లు కనిపిస్తోందని ఆకాశ్ చెప్పాడు.

‘తొలిసారి ధోని ఐదుగురు బౌలర్లను ఆడిస్తున్నాడు. రాయుడు లేకపోవడంతోపాటు తన బ్యాటింగ్ గురించి కూడా ధోని ఆందోళన చెందుతున్నట్లు అనిపిస్తోంది. తన బ్యాటింగ్ ఫామ్‌‌‌పై ధోని వంద శాతం నమ్మకంతో లేన్నట్లు కనిపిస్తోంది. మురళీ విజయ్ రన్స్ చేయడం లేదు. మరోవైపు ఆడిన మూడు మ్యాచుల్లో 4 ఓవర్లు వేసిన జడేజా 40 రన్స్ ఇచ్చాడు’ అని ఆకాశ్ పేర్కొన్నాడు.

Latest Updates