ధోని నా ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్‌నర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్‌నర్ అని యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చెప్పాడు. ధోనితో కలసి బ్యాటింగ్ చేయడం సులువుగా ఉంటుందన్నాడు. మహీ పార్ట్‌నర్‌‌గాఉన్నప్పుడు అతడి సూచలనలను పాటిస్తే సరిపోతుందని, ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉండదన్నాడు. కానీ తనకు ధోనీతో కలసి బ్యాటింగ్ చేసే చాన్స్ ఎక్కువగా లభించలేదని పేర్కొన్నాడు.

‘నాకు చాలా ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్‌నర్ ధోని. కానీ మహీతో కలసి బ్యాటింగ్ చేసే చాన్స్ ఎప్పుడో కానీ రాదు. అతడు నాతోపాటు క్రీజులో ఉంటే ప్రతిదీ సులువుగా అనిపిస్తుంది. అతడు ప్లాన్స్‌ వేస్తాడు. మనం వాటిని అనుసరిస్తే సరిసోతుంది. లక్ష్యాలు ఛేదించే టైమ్‌లో అతడి మైండ్ అద్భుతంగా పని చేస్తుంది. విరాట్, రోహిత్‌తో కలసి బ్యాటింగ్ చేయడాన్నీ ఆస్వాదిస్తా. ఈ సీనియర్స్‌లో ఎవరితో కలసి బ్యాటింగ్ చేసినా అది ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. వారితో ఆడటం వినోదంగానూ ఉంటుంది. వారి మైండ్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవచ్చు. ఐపీఎల్‌లో శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్‌‌తో కలసి ఆడినప్పుడు కూడా వైవిధ్యంగా అనిపిస్తుంది’ అని పంత్ వివరించాడు.

Latest Updates