టీ20 సిరీస్ లో ధోనికి నో ఛాన్స్

ముంబై : ఊహించినదే జరిగింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో సెలెక్టర్లు ధోనీకి అవకాశమివ్వలేదు. వచ్చే నెలలో సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది.  పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు విశ్రాంతినివ్వగా, వెస్టిండీస్‌ టూర్‌ దూరంగా ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యాను జట్టులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు తప్ప వెస్టిండీస్‌ సిరీస్‌లో ఆడిన జట్టే ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు.  భువీ గైర్హాజరీలో ఖలీల్‌, దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ పేస్‌ విభాగాన్ని నడిపించనున్నారు.  కీపర్‌గా రిషబ్‌ పంత్‌నే కొనసాగించారు. టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని మరో ఇద్దరు కీపర్లను పరీక్షిస్తారని భావించినా.. సెలెక్టర్లు ఆ పని చేయలేదు.

జట్టు: కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌(వైస్‌ కెప్టెన్‌), ధవన్‌,  రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌పంత్ (కీపర్‌), హార్దిక్‌, క్రునాల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చహర్‌, ఖలీల్‌, దీపక్‌ చహర్‌, సైనీ.

Latest Updates