నెట్ ప్రాక్టీస్‌ షురూ చేసిన ఎంఎస్ ధోని

రాంచీ: వచ్చే నెల 19న యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెటర్‌‌లు ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. సొంతూరు రాంచీలో ధోని నెట్‌ ప్రాక్టీస్ షురూ చేశాడు. జేఎస్‌సీఏ ఇండోర్ గ్రౌండ్‌లో ధోని రన్నింగ్‌ చేశాడని తెలిసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాంచీలో ఎక్కువ మంది బౌలర్లు అందుబాటులో లేరు. దీంతో ధోని బౌలింగ్ మెషిన్స్‌పై ప్రాక్టీస్ చేశాడని తెలిసింది.

‘ధోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌ను గత వారంలో విజిట్ చేశాడు. ఇండోర్‌‌లో బౌలింగ్ మెషిన్‌ సాయంగా ధోని ప్రాక్టీస్ చేశాడు. వారంలో రెండ్రోజులు అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ మళ్లీ అతడు తిరిగి రాలేదు. అతడి ప్లాన్స్‌ ఏంటో నాకు తెలియదు. మళ్లీ ట్రెయినింగ్ కోసం తిరిగొస్తాడేమో. ప్రాక్టీస్‌ కోసం అతడు ఇక్కడికి వచ్చాడనేది మాత్రమే మాకు తెలుసు’ అని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఏసీఏ) ఆఫీస్ బేరర్ తెలిపారు.

Latest Updates