ధోనీ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలి: కుంబ్లే

ముంబై: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌కు మాజీ కెప్టెన్ ఎంఎస్‌‌ ధోనీ అందుబాటులో ఉంటాడో లేదో అనే దానిపై సెలెక్టర్లు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఇండియా మాజీ కోచ్‌‌ అనిల్‌‌ కుంబ్లే సూచించాడు. దీనిపై అతనితో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని తెలిపాడు. ధోనీ కనుక వరల్డ్‌‌కప్‌‌లో ఆడించాలనుకుంటే ఇకపై జరిగే ప్రతీమ్యాచ్‌‌లో తనకు అవకాశమివ్వాలని అన్నాడు. దీనిపై వచ్చే రెండునెలల్లోగా సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. మరోవైపు టెస్టు జట్టులో ఓపెనర్‌‌గా రోహిత్‌‌ శర్మ బెస్ట్‌‌ చాయిస్‌‌ అవునో కాదో తాను చెప్పలేనని తెలిపాడు. అలాగే క్లాసిక్‌‌ ఫార్మాట్‌‌లో రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ బెస్ట్‌‌ స్పిన్నరని, అతనికి తుదిజట్టులో చోటు కల్పించేలా చూడాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

 

Latest Updates