ధోనిని జట్టు పంపించేలోపే వెళ్లిపోవాలి: గవాస్కర్

గత కొన్ని రోజులుగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ధోని రిటైర్మైంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ధోని భారత క్రికెటర్ కు ఎంతో కృషి చేశాడని అన్నారు. అయితే ధోనికి రిటైర్మెంట్ సమయం ఆసన్నమైందన్నారు. అయితే ధోనిని జట్టు పంపించేలోపే తానే వెళ్లిపోతాడని అనుకుంటున్నట్లు చెప్పారు. టీమిండియా భవిషత్తు గురించి ఆలోచించాలన్నారు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలన్నారు. రిషబ్ పంత్..సంజూ సామ్సన్ కొత్త వికెట్ కీపర్లుగా రాణించగలరని అన్నారు.

Latest Updates