గాయాన్ని దాచి దేశ సేవకు

న్యూఢిల్లీ:    టీమిండియా వెటరన్​ క్రికెటర్ ​ధోనీ గాయాన్ని దాచి ఇండియా ఆర్మీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వరల్డ్​కప్​లో ఇంగ్లండ్​తో మ్యాచ్​ సందర్భంగా బంతి తగలడంతో ధోనీ కుడి చేతి బొటన వేలుకు గాయమైంది. దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని అప్పట్లో టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్​ ప్రకటించింది. అనంతరం ధోనీ కూడా సాధారణంగానే  ఇతర మ్యాచ్‌‌ల్లో ఆడాడు. అయితే  ఆ మ్యాచ్‌‌లో ధోనీ చేతి వేలికి ఫ్రాక్చర్​అయిందని, ఆర్మీలో పని చేసేందుకు మహీ ఈ విషయాన్ని దాచిపెట్టాడని తెలుస్తోంది. టెరిటోరియల్ ఆర్మీ నిబంధనల ప్రకారం గాయపడ్డ వ్యక్తులను ట్రైనింగ్‌‌కు అనుమతించరనే  అతను  ఇలా చేశాడని సమాచారం.

Latest Updates