జీనియస్ జీవా… ధోనీ కూతురు టాలెంట్ చూశారా..!

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్  MS ధోని సోషల్‌ మీడియాలో కనిపిస్తే తన కూతురు జీవా కూడా ఉండాల్సిందే.తన ముద్దుల కూతురుతో కలిసి ధోని చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి అల్లరికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు ధోని. తాజాగా ఈ తండ్రి కూతుళ్లిద్దరికీ సంబంధించిన మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు ధోని. ఈ వీడియోలో జీవా…ధోని అడిగిన ఓ ప్రశ్నకు ఆరు భాషల్లో సమాధానం చెప్పి అదరగొట్టింది. ధోని తన కూతుర్ని ‘హౌ ఆర్‌ యూ  అని తమిళ్‌, బెంగాళీ,గుజరాత్‌, పంజాబీ, భోజ్‌పూరి, ఉర్థూ భాషల్లో అడుగుతాడు. జీవా కూడా ధోని ఏ భాషల్లో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం  అందరినీ ఆకట్టుకుంది.

Latest Updates