డే నైట్‌‌ టెస్ట్‌‌లో ధోనీ కామెంట్రీ ఉండదా?

చరిత్రాత్మక డేనైట్‌‌ టెస్ట్‌‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీ కామెంట్రీ చెప్పే అవకాశాలు కనిపించడం లేదు. ఇండియా క్రికెట్‌‌ మాజీ సారథులందర్ని ఈ టెస్ట్‌‌కు ఆహ్వానించి కామెంట్రీ చెప్పించాలని స్టార్‌‌ స్పోర్ట్స్‌‌… బీసీసీఐ ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. ఈ ప్రతిపాదనపై మహీ ఇంతవరకు స్పందించలేదు. వన్డే వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌ తర్వాత క్రికెట్‌‌కు దూరంగా ఉన్న ధోనీ.. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌ ప్లేయర్‌‌.  అయితే కొత్త రాజ్యాంగం ప్రకారం సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌ ప్లేయర్లెవరూ వ్యాఖ్యాతగా పని చేయకూడదు. అలా చేస్తే ‘కాన్‌‌ప్లిక్ట్‌‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌‌’ కిందకు వస్తుంది. ఇదే విషయాన్ని మహీ సన్నిహితులు చెబుతున్నారు. ‘ఏ రకంగా చూసినా పింక్‌‌ బాల్ టెస్ట్‌‌కు ధోనీ కామెంట్రీ చెప్పడం కష్టమే’ అని పేర్కొన్నాయి.

Latest Updates